Bjp leaders” శంకరపట్నం డిసి ప్రతినిధి
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కు బిజెపి నాయకులు గురువారం ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బిజెపి పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “హిందుత్వవాది, కరీంనగర్ ముద్దుబిడ్డ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం ఈ నెల 11న ఉంటుందని, అందువల్ల ముందస్తుగా ఆయన్ను శుభాకాంక్షలు తెలపడానికి కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర, జిల్లా, మండలాల నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది” అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు చిక్కుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
