Women Empowerment” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా | డిసీ ప్రతినిధి
మహిళలు కార్పొరేట్ స్థాయిలో వ్యాపారవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మండల ఏపీఎం సుధాకర్ తెలిపారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరా శక్తి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇందిరా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన
ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిత్యం రుణాల రూపంలో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఆ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా స్వయం సాధికారత సాధించాలన్నారు.
సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా
తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం నిర్వహించిన పాటలు, నాటికలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంచేలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జూలై 18 వరకు అవగాహన సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 18వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళాశక్తి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఏపీఎం సుధాకర్ తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సిసిలు సంపత్, రాజ్ కుమార్, వివిధ గ్రామాల వీఎవోలు, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.
