Hostel Cleanliness” వసతి గృహాల్లో పరిశుభ్రతపై దృష్టి… సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

Hostel Cleanliness” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా | డిసీ ప్రతినిధి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని వసతి గృహాల్లో పరిశుభ్రత, పౌష్టికాహారంపైనే కాక, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా మలేరియా బృందం సభ్యుడు డాక్టర్ వెంకట రమణారెడ్డి సూచించారు. గురువారం ఆయన మండల వైద్యాధికారి డాక్టర్ గొట్టి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కేశవపట్నంలోని పలు వసతి గృహాలను సందర్శించారు.

మలేరియా నివారణకు స్ప్రే చర్యలు

ఈ సందర్శనలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, కస్తూరిబా గాంధీ పాఠశాల వసతి గృహం, ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో పరిశుభ్రతను పరిశీలించి, దోమల నివారణకు ఇండోర్ రెసిడెంట్ స్ప్రే చేయించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నిత్యం పరిశుభ్ర వాతావరణం, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వసతి గృహ నిర్వాహకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య (ఆయుష్), హెల్త్ సూపర్వైజర్ అనిల్, మలేరియా టీం సభ్యులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *