Congress Ordinance” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాల కోసం 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ సభ్యులు, శంకరపట్నం మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
శనివారం మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా బహుజనులకు న్యాయం చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదానికి నిదర్శనం,” అని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రకటించిన ప్రకటనకు అనుగుణంగా, తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం చేకూరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Raichur”సెల్ఫీ తీసుకుందామని చెప్పి… భర్తను నదిలోకి తోసిన భార్య!” వీడియో
