Patel Youth Force” పటేల్ యూత్ ఫోర్స్ ప్రథమ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 14వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వి-కన్వెన్షన్ లో (Patel Youth Force) పటేల్ యూత్ ఫోర్స్ గర్జన సభను నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించిన (Patel Youth Force)పటేల్ యూత్ ఫోర్స్ స్టిక్కర్స్ ఆవిష్కరించారు. కరీంనగర్లోని బొమ్మ వెంకన్న పటేల్ విగ్రహం నుంచి వేలాదిగా యూత్ (Patel Youth Force)పటేల్స్ తో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కరీంనగర్ – గోదావరిఖని బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ లో యూత్ ఫోర్స్ గర్జన సభను నిర్వహించనున్నారు. ఈ సభకు మున్నూరు కాపు జర్నలిస్టులు, అడ్వకేట్స్, రాజకీయనాయకులు, మేధావులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో నిష్ణాతులయిన ప్రముఖ మున్నూరు కాపు కుల బాంధవులు హాజరుకానున్నారు. 16 మున్నూరు కాపు సంఘాల ఈ సభకు మద్ధతు తెలిపాయి. కొత్తలక్ష్మణ్ పటేల్, వేల్పుల శ్రీనివాస్ పటేల్, సూదుల వెంకటరమణ, పటేల్ యూత్ ఫోర్స్ సభ్యులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి
School Bus Accident” స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులు మృతి
Tamilanadu Accident” బైక్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో రికార్డు.. ఐదుగురు మృతి