Siddipet” సిద్దిపేట, జూలై 12: మానవత్వం మరిచి, డబ్బు కోసం నీచానికి ఒడిగట్టిన ఘోర ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రామవ్వ (57) అనే వృద్ధురాలును అల్లుడు కుట్ర పన్ని హత్యకు చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. రామవ్వ అల్లుడు వెంకటేష్ మార్చి నెలలో ఆమె పేరు మీదగా పోస్టాఫీస్, ఎస్బీఐ బ్యాంకులలో రూ.60 లక్షల విలువైన బీమా పాలసీలు తీసుకున్నాడు. బీమా డబ్బులు పొందాలంటే రామవ్వ మృతిచెందితే, అది ప్రమాదంగా (ఆక్సిడెంట్) నమోదైతే తమకు డబ్బులు అందుతాయని దురాలోచనతో పథకం రచించాడు.
పూర్తి ప్రణాళికతో హత్య:
వెంకటేష్ తన స్నేహితుడికి ఈ పథకాన్ని వివరించి, బీమా డబ్బుల్లో సగం ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం, అద్దెకు కారును తీసుకొని సిద్దంగా ఉంచాడు.
తర్వాత “పనులున్నాయ్” అని చెప్పి రామవ్వను పొలం వద్దకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి సమయానికి ఆమెను ఒంటరిగా ఇంటికి వెళ్లమని పంపించాడు.
ఆ సమయంలో కారులో ఎదురుచూస్తున్న వెంకటేష్ స్నేహితుడు, రామవ్వపై కారుతో డాష్ చేశాడు. అనంతరం ఈ ప్రమాదాన్ని సాధారణ రోడ్డు ప్రమాదంగా మలచేందుకు ప్రయత్నించారు.
సీసీటీవీ ఆధారంగా ఛేదించిన దారుణం:
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ సంఘటనపై అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో వెంకటేష్ అసలు కథను ఒప్పుకున్నాడు. బీమా డబ్బుల కోసమే అత్తను హత్య చేశానని పోలీసులకు తెలిపినట్టు సమాచారం..
ప్రస్తుతం పోలీసులు వెంకటేష్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.
రూ.60 లక్షల భీమా డబ్బుల కోసం అత్తను చంపించిన అల్లుడు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రామవ్వ (60) అనే మహిళ పేరుపై మార్చిలో పోస్టాపీస్‌లో, ఎస్బీఐ బ్యాంకులో భీమాలు చేయించిన అల్లుడు వెంకటేష్
ఈ క్రమంలోనే అత్తను చంపేసి, ఆక్సిడెంట్‌లా చిత్రీకరిస్తే… pic.twitter.com/wMkfNe7ieW
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2025
