Dsp Mahesh” శంకరపట్నం డిసి ప్రతినిధి..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ ఏసిపి వి. మాధవి భర్త సీనియర్ డిఎస్పి మహేష్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. డీఎస్పీ మహేశ్ 1995 బ్యాచ్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి.. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి వి.మాధవి హుజురాబాద్ ఎసిపి గా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం డీఎస్పీ మహేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే డీఎస్పీ మహేష్ ను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. మహేష్ కు వైద్యం అందించిన డాక్టర్లు సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. మహేష్ మరణించినట్లు ధృవీకరించారు. భర్త తన కళ్ళ ముందే భర్త మరణించడంతో హుజురాబాద్ డిఎస్పి వి మాధవి రోదనలు పలువురుని కంటతడి పెట్టించాయి. కరీంనగర్ పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
