tjs”
శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడంపై నిరసనగా, కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దిష్టిబొమ్మను మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై టీజేఎస్ మరియు సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో దహనం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా కన్వీనర్ మోరె గణేష్ మాట్లాడుతూ, మొలంగూర్ గ్రామంలో 703 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా ఆక్రమణకు గురైందని తెలిపారు. అందులో భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్న లక్ష్యంతో టీజేఎస్ పర్యవేక్షణలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని భూ పోరాటం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ పోరాటానికి ఉన్నతాధికారుల నుంచి స్పందన వచ్చినా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూమిని విముక్త చేసి ఇందిరమ్మ ఇండ్ల కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా, డీపీఓ గత 20 రోజులుగా స్పందించకపోవడం వల్ల ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్జెఎస్ మండల అధ్యక్షుడు నేలవేణి రమేష్, మహిళా విభాగం కార్యదర్శి అరికెల శ్రావంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మావునూరి గణేష్, సీపీఐ నాయకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

♂️ స్టైల్ మచ్చిక!
హవెల్స్ ట్రిమ్మర్ కేవలం ₹1,349/- కి!
➡️ 29% డిస్కౌంట్
Cord & Cordless – స్టైలిష్ బ్లూ
Li-Ion Battery – Powerful & Long-lasting
Amazon లో అందుబాటులో ఉంది! https://amzn.to/4fl8LQJలింక్ పై క్లిక్ చేయండి…
