Bathini-srinivas-goud” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఉందని టీపీసీసీ సభ్యుడు, మాజీ జెడ్పిటిసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవాఖానను ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ వైద్య సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ పరిస్థితులపై villagers నుంచి సమాచారం సేకరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఎరడపల్లి గ్రామానికి నియమితమైన ఏఎన్ఎం స్వప్న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ గ్రామానికి రావడం లేదని స్థానికులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇప్పటికైనా ఆమె గ్రామానికి హాజరై విధులు నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ సురేష్‌కు సూచించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సహించబోదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చేస్తాం” అని హెచ్చరించారు. ఇప్పటికే గ్రామస్థుల వినతుల మేరకు ఫిర్యాదు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ పంజాల వెంకటేశం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలంగూరి సదానందం, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ షారుక్, నాయకుడు భూమ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వ్యవహారంపై ఏఎన్ఎం స్వప్న విధుల నిర్వహణపై వివరణ కోరుతూ, సెల్‌ఫోన్ ద్వారా మండల వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్‌ను సంప్రదించగా ఏమీ స్పందన రాలేదు.

HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్
⚡ 13th Gen ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్
⚡ NVIDIA RTX 2050 గ్రాఫిక్స్
⚡ 16GB DDR4 ర్యామ్ (32GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు!)
⚡ 512GB SSD – సూపర్ ఫాస్ట్ స్టోరేజ్
⚡ 15.6” FHD, 144Hz IPS డిస్ప్లే – క్లియర్ & స్మూత్!
⚡ Windows 11 + MS Office 24 ఉచితంగా
⚡ సరికొత్త మైకా సిల్వర్ డిజైన్ | కేవలం 2.3 కిలోలు
మీ ఆటను స్టైల్‌తో, వేగంతో గెలవండి! https://amzn.to/44HxXwZలింక్ పై క్లిక్ చేయండి
