నన్ను క్ష‌మించండి : మ‌న్సూర్

స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తమిళ యాక్ట‌ర్ మన్సూర్‌ ఆలీ ఖాన్ క్షమాపణలు చెప్పారు. ఆయ‌న చేసిన సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. మ‌న్సూర్ చేసిన వ్యాఖ్య‌లపై సినీ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. మ‌న్సూర్ పై క‌ఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయినా ఆయన మాత్రం సారీ చెప్ప‌బోను అని తేల్చి చెప్పారు. ప‌రిస్థితి తీవ్ర ఉన్న నేప‌థ్యంలో మ‌న్సూర్ ఆలీ ఖాన్ వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్ధం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది’ అంటూ వెల్లడించారు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్‌ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్‌ సీన్లు చేశాను. రేప్‌ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు. అంటూ మన్సూర్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై త్రిష కూడా ఘాటుగా స్పందించింది. మన్సూర్‌ అలీ ఖాన్‌ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోంది. అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్పటివరకు స్కీన్ర్‌ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని. నా మిగిలిన కెరీర్‌ లో అలాగే నా సినిమాలో అతడు లేకుండా చూసుకుంటాను. మన్సూర్‌ అలీ ఖాన్‌ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది. అంటూ త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

 

సినిమా షూటింగ్‌లో హీరో సూర్య‌కు గాయాలు

యానిమల్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది ర‌ణ్‌బీర్‌, రష్మికల కాంబినేషన్‌

త్రిషకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *