Border Conflict” మ‌రో రెండు దేశాల మ‌ధ్య యుద్దం షురూ…? తాజా అప్‌డేట్స్

Border Conflict”  ఇప్ప‌టికే ప్ర‌పంచంలో చాలా దేశాల (Thailand Cambodia border conflict) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. కొన్ని దేశాల మ‌ధ్య యుద్దం కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు మ‌రో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. (Thailand Cambodia tension 2025)

థాయ్‌లాండ్ జాతీయ భద్రతా మండలి (NSC) ప్రకారం, గురువారం ఉదయం థాయ్ సైనికులు కంబోడియా సైనికులతో శాంతియుతంగా మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, వారి హెచ్చరికలను కంబోడియా వారు పట్టించుకోలేద‌ని తెలిపారు.  (Thailand vs Cambodia military clash) కంబోడియా సైనికులు భారీ ఆయుధాలతో, ముఖ్యంగా ఆర్టిలరీ, రాకెట్ లాంచర్లతో, థాయ్ సరిహద్దులోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసారని NSC ఆరోపించింది.  (Preah Vihear temple conflict ) దీంతో ఇరు దేశాల మ‌ధ్య కాల్పులు జ‌రిగిన‌ట్టు తెలుస్తున్న‌ది.

ఇదివరకే కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం భిన్నంగా స్పందించింది. థాయ్ సైనికులే ముందుగా గాలిలో కొద్ది కాల్పులు జరిపిన తర్వాత కంబోడియా స్థావరాలపై కాల్పులు ప్రారంభించారని, తద్వారా తమకు ప్రతిరక్షణ కోసం కాల్పులు జరిపాల్సి వచ్చిందని వెల్లడించింది.

ఈ ఉద్రిక్తతల మధ్య థాయ్‌లాండ్ ప్రభుత్వం ఇప్పటివరకు 12 మంది మృతులను ధ్రువీకరించింది, వీరిలో చాలా మంది పౌరులే. కంబోడియా మాత్రం తన పక్షాన నష్టం వివరాలను వెల్లడించలేదు.

సరిహద్దు ఘర్షణపై తాజా ఐదు ముఖ్యమైన అప్‌డేట్లు: Thai Cambodian army clash
1. సైనిక ప్రయోజనాల కోసం అడవులు తెరిచిన థాయ్‌లాండ్:
థాయ్‌లాండ్‌లోని నాలుగు వైల్డ్‌లైఫ్ సంరక్షణ కేంద్రాలు, రెండు జాతీయ ఉద్యానవనాలను సైనిక అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ ఉద్భొద్ధన వర్గాలు ప్రకటించాయి. వీటిని కౌంటర్-అటాక్ ప్రణాళికల కోసం వాడనున్నారు. (BBC నివేదిక)

2. F-16 యుద్ధ విమానం దాడి:
థాయ్ సైన్యం ప్రకారం, తమ US-నిర్మిత F-16 యుద్ధ విమానం ఒక కంబోడియా మిలిటరీ టార్గెట్‌ను ధ్వంసం చేసింది. అవసరమైతే మరిన్ని యుద్ధ విమానాలు మోహరించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. (The Guardian)

3. యుద్ధ ప్రకటన లేదన్న థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని:
థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్‌థామ్ వెచయచాయ్ ప్రకారం, దేశం కంబోడియాపై యుద్ధం ప్రకటించలేదనీ, ఈ ఘర్షణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించదని తెలిపారు. Border violence Southeast Asia

4. సరిహద్దు చెక్‌పాయింట్లు మూసివేత, ఆరు ప్రదేశాల్లో పోరు:
థాయ్ సైనికాధికారులు అన్ని సరిహద్దు చెక్‌పాయింట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరు ప్రాంతాల్లో సైనిక ఘర్షణ కొనసాగుతోంది. కంబోడియా ప్రకారం, థాయ్ దళాలు తమ రెండు ప్రావిన్సులపై షెల్ దాడులు చేశాయి.

5. తొలి కాల్పులపై పరస్పర ఆరోపణలు:
ఘర్షణ మొదలుపెట్టింది ఎవరో అన్న విషయంలో ఇరుదేశాలు ఒకరినొకరు తప్పుబడుతున్నాయి. థాయ్‌లాండ్ ప్రకారం, ప్రెహ్ విహార్ దేవాలయం సమీపంలో కంబోడియా సైనికులే మొదటగా కాల్పులు జరిపారు. కంబోడియా మాత్రం దీనిని ఖండిస్తూ, ముందుగా దాడి చేసింది థాయ్ సైన్యమేనని ఆరోపించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *