Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Crime News

Crime News” మాజీ సోల్జ‌ర్ త‌న సొంత కుటుంబ స‌భ్యులనే దారుణంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న హ‌ర్యాల‌నాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రంలోని రాట‌ర్ గ్రామానికి చెందిన భూష‌ణ్ కుమార్ త‌న త‌ల్లి, సోద‌రుడు, మేన‌కోడలితో స‌హా ఆరుగురిని గొడ్డ‌లితో న‌రికి చంపాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య భూ వివాదం వల్లే ఈ ఘ‌ర్ష‌ణ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. నిందితుడు భూష‌ణ్ కుమార్ అత‌ని సోద‌రుడు హ‌రీశ్‌తో కొంత కాలంగా భూవివాదం న‌డుస్తోంది. ప‌లుమార్లు ఇద్ద‌రీ మ‌ధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్ మీద ప‌గ పెంచుకున్న భూష‌ణ్ ఆదివారం రాత్రి నిందితుడు సోద‌రుడి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న కుటుంబ స‌భ్యుల‌పై గొడ్డ‌లితో దాడిచేసి హ‌త్య చేశాడు. అనంత‌రం మృత దేహాల‌ను కాల్చే ప్ర‌య‌త్నం చేయ‌గా తండ్రి అడ్డుకోబోయాడు. అతనిపై కూడా భూష‌ణ్ దాడి చేశాడు. తండ్రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. చ‌నిపోయిన వారు భూష‌న్ త‌ల్లి స‌రూపిదేవీ(65) సోద‌రుడు హ‌రీశ్ (35), హ‌రీశ్ భార్య సొనియా (32), వీరి పిల్ల‌లు మ‌యాంక్ (6) యాషిక‌(5)లు ఉన్నారు.

 

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిప‌డ్డ దంప‌తులు.. సీసీ టీవీ వీడియో

Upsc exams” ప్రిలిమ్స్ పాసైనోళ్ల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *