Karimnagar bjp” శంకరపట్నం డిసి ప్రతినిధి..
కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, ఇదిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు కూడా కేంద్ర నిధులతోనే జరిగుతున్నట్లు జిజేపి మండల ఎన్నికల ప్రభారి గుజ్జ శ్రీనివాస్ తెలిపారు. బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల కార్యశాలలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రత్యేక నిధులు విడుదల చేసి, గ్రామాల్లో వైకుంఠ దామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీల నిర్వహణతో పాటు కొత్త సీసీ రోడ్లు కూడా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేయబడిన నిధుల ద్వారా చెల్లింపుచేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వవద్ద గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబడలేదని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే స్థానిక ఎన్నికలకు బిజెపి నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, నాయకులు దొంగల రాముడు, దాసారపు నరేందర్, మందాడి జగ్గారెడ్డి, కొయ్యడ అశోక్, వివిధ మండల మోర్చా అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

FLAIR Clixx Mechanical Pencils – మీ డ్రాయింగ్ కు స్నేహితులు! ✏️
0.7 mm మిడియం లీడ్‌తో
రిలాక్స్ అయ్యి డ్రా చేయడానికి ట్రయాంగ్యులర్ బ్యారెల్
తేలికపాటి, సౌకర్యవంతమైన గ్రిప్
ప్రతి పెన్సిల్‌తో ఉచితంగా లీడ్ ట్యూబ్ ఒకటి
ప్యాక్ లో 10 పెన్సిల్స్!
మీ క్రియేటివిటీకి, మీ చేతికి నమ్మకమైన తోడుగా FLAIR Clixx!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4lJPxX2లింక్ పై క్లిక్ చేయండి.
