OperationMahadev” ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం: పహల్గాం దాడికి సూత్రధారి సులేమాన్ హతం..

#OperationMahadev,

జూలై 28, 2025
ప్రత్యేక ప్రతినిధి నివేదిక

శ్రీనగర్: పహల్గాం  (Pahalgam Terror Attack ) ఉగ్రదాడి వెనుకనున్న ప్రధాన సూత్రధారి సులేమాన్ హతమైనట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. జమ్మూ & కాశ్మీర్‌లోని లిద్వాస్ ప్రాంతంలో భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో లష్కరే తోయిబా కి చెందిన సులేమాన్, అబూ హమ్‌జా, యాసిర్ ఉన్నారు.

పహల్గాం దాడి నేపథ్యం:

2025 ఏప్రిల్ 22న పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి గల ప్రధాన కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, దాని సూత్రధారిగా Suleman Killed సులేమాన్ గుర్తించబడ్డాడు.

ఆపరేషన్ మహాదేవ్ వివరాలు:

ఇప్పటికే చినార్ కార్ప్స్ అధికారిక X ఖాతా ( Twitter) ద్వారా సమాచారం వెలువడింది.
“లిద్వాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించాయి. ముగ్గురు ఉగ్రవాదులు  మ‌ట్టు బెట్ట‌బ‌డ్డారు.  భారీ  కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ కొనసాగుతోంది,” అని ఆర్మీ ట్వీట్ చేసింది.

రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన:

ఈ విజయవంతమైన ఆపరేషన్ జరుగుతుండగానే, పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాదాన్ని బట్టి తుడిచేస్తాం,” అని వ్యాఖ్యానించారు.

ప్రజల నుంచి ప్రశంసలు:

భద్రతా బలగాల ఈ విజయానికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో #OperationMahadev అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

 

మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను Level Up చేయండి!
ఇది ఉంది – Xiaomi 80cm (32″) HD Ready Smart Fire TV
HD Ready Resolution (1366 x 768) | 60Hz Refresh Rate

2 HDMI, 2 USB, Bluetooth, Wi-Fi
20W Speaker Output | Dolby Audio | DTS Virtual:X

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమ్స్ అన్నీ ఒక్కటే స్క్రీన్‌లో!
️ Alexa Built-in – వాయిస్‌తోనే నియంత్రించండి!

Style, Sound, Smartness – అన్నీ ఓ టీవీలో!

https://amzn.to/457Zsi4అమెజాన్‌లో కొనేందుకు లింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *