War-2″ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని కలిగించాయి. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలే ఉండటంతో ప్రమోషనల్ ఈవెంట్ల పట్ల బృందం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 10న విజయవాడలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వేడుకకు తెలుగు వెర్షన్ హక్కులు పొందిన నిర్మాత నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వ్యూహం రచిస్తున్నారని సమాచారం.
ఈ వేడుకకు ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా హాజరవుతారన్న ఊహాగానాలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే వేదికపై దర్శనం ఇస్తే, ఈ ఈవెంట్ టాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాన్స్‌కు అన్ఫర్గెటబుల్ మైలు రాయిగా నిలవడం ఖాయం.
వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Great freedom festival” గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ వచ్చేస్తోంది!
