Vishwambhara” విశ్వంభరలో ఆషిక రంగనాథ్‌ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

Vishwambhara”  మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎం.ఎం.కీరవాణి, తన ప్రత్యేకమైన సంగీతం అందించి ప్రేక్షకుల్ని అలరించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ ఒకటి విడుదలైంది.
హీరోయిన్‌ ఆషిక రంగనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ అభిమానుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఇందులో ఆషిక అద్భుతంగా కనిపించడంతో పాటు, ఆమె పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అనిపిస్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్‌ లో అడుగుపెడుతున్న ఆమె, చిరంజీవి సరసన త్రిషతో కలిసి ముఖ్యపాత్రల్లో కనిపించనుంది.
విశ్వంభర్‌ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ఈ పోస్టర్‌తో ప్రారంభమయ్యాయి. భారీ విజువల్స్, గ్రాఫిక్స్, మైథలాజికల్‌ టచ్‌ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి లేదా దసరా సీజన్‌లో విడుదల చేయాలని టీమ్‌ భావిస్తోంది. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేకతగా నిలవనుందని cine వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *