Bike Accident” రెండు ద్విచక్ర వాహనాలు డీ ఇద్దరికీ గాయాలు..

Bike Accident”  శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక్కరికి గాయాలైన ఘటన తిమ్మాపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మశెట్టి గోపి రాజ్ అనే వ్యక్తి కరీంనగర్ నుండి తిమ్మాపూర్ మండలం పార్లపల్లి గ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గ‌మ‌ధ్య‌లో తిమ్మాపూర్ మండలం నల్లగొండ శివారులోకి రాగానే మ‌రొక ద్విచ‌క్ర వాహ‌నంతో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో గోపిరాజుకు గాయాలు కాగా గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి పైలట్ ఖాజా ఖలీల్ ఉల్లా ఘటనా స్థలానికి చేరుకొని గోపిరాజుకు ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు.

అమెజాన్లో కొనేందుకు లింక్ పై క్లిక్ చేయండి.. https://amzn.to/45mPglW

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *