Panduga Sainna” ముదిరాజులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి

 Panduga Sainna”  పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి
– ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ (PSF) నాయకులు అభిలాష్ గౌడ్, జయసూర్య

శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన ముదిరాజ్ యోధుడు పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే ముదిరాజులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు అభిలాష్ గౌడ్, జయసూర్య డిమాండ్ చేశారు.

శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా వారు మాట్లాడారు.
బీసీ జనాభాలో ముదిరాజులు అత్యధిక శాతం ఉన్నా, వారికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజల సమస్యలపై పి.ఎస్.ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు.

Sbi Recruitment2025″ ఎస్‌బీఐలో 6 వేల ఉద్యోగాలు.. జూనియర్ అసోసియేట్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *