TelanganaHeavyRain” హైదరాబాద్, ఆగస్ట్ 8 : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న వేళ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
నల్లగొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాభావ శక్తితో బలపడుతున్న వాతావరణం
క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇవాళ సాయంత్రం మరియు రాత్రి వేళ వర్షాలు కురిసే అవకాశముంది. నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే నిన్నటి వర్షంతో పోలిస్తే ఇవాళ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మధ్యాహ్నం వరకు వర్ష సూచనలు లేవని పేర్కొనడంతో పాటు, సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలియజేసింది.
తేదీల వారీగా వర్ష సూచనలు
-
ఆగస్ట్ 9, 10: నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు.
-
ఆగస్ట్ 11, 12: తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
-
ఆగస్ట్ 13: రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాల సూచన.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది సాధారణ షవర్ కాదు…
ఇది **Benelave by Hindware** Ultra Thin Rain Shower
✅ 200mm స్క్వేర్ డిజైన్
✅ స్టైలిష్ మిర్రర్ లాంటి క్రోమ్ ఫినిష్
✅ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ
నీళ్ల వర్షంలో కొత్త ప్రశాంతత అనుభవించండి… ️
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4fuberLలింక్ పై క్లిక్ చేయండి..
