Akhanda 2″ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరోసారి కలసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించగా, ఇప్పుడు ఈ జోడీ మరోసారి మ్యాజిక్ చేయబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు.
2021లో విడుదలైన అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, బాలయ్య అభిమానులకు పండుగలా ఉండనుంది. మొదటి భాగంలో ఆయన పోషించిన ఆఘోర పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను ప్రత్యేకమైన మాస్ టచ్, తమన్ సంగీతం, బలమైన కథన శైలితో కలసి ఆ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది.
ఈసారి ఆ స్థాయి విజయం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ మాస్ యాపిల్ కలిగిన కథనాన్ని తెరపై చూపించేందుకు బోయపాటి పట్టు వదలడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్యకు తోడుగా ప్రగ్యా జైశ్వాల్, సంజయ్ దత్, ఆది పినిశెట్టి, సంయుక్త వి. మేనన్, జగపతిబాబు, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటిస్తున్నారు.
ఈ భారీ మల్టీస్టారర్ సినిమా అతి త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. రోమంచక కథనం, పవర్‌ఫుల్ డైలాగులు, ఆకట్టుకునే బాణీలు, విజువల్ ట్రీట్‌తో ‘అఖండ 2’ సినీ అభిమానులకు మరచిపోలేని అనుభూతిని అందించనుందని సినీ వర్గాల అంచనా…
లింక్ పై క్లిక్ చేయండి
Sbi Recruitment2025″ ఎస్‌బీఐలో 6 వేల ఉద్యోగాలు.. జూనియర్ అసోసియేట్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2025
