Kesavapatnam 108″ సోదర భావంతో వైద్య సేవలు – కేశవపట్నం 108 వాహన సేవలపై ప్రశంసలు

Kesavapatnam 108″  తనిఖీ నిర్వహించిన ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్

శంకరపట్నం: డీసీ ప్రతినిధి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 వాహన సేవలు ప్రజలకు సోదర, స్నేహ సంబంధంతో వైద్య సేవలు అందించాలని 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి చెందిన కేశవపట్నం గ్రామంలో ఉన్న 108 వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయన మాట్లాడారు.

ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 108 సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉండాలని, గాయాల పాలైనవారు లేదా రోగంతో బాధపడే వారు సమాచారం ఇచ్చిన వెంటనే, 108 సిబ్బంది వారు సమయపాలనతో స్పందించి ప్రథమ చికిత్స అందించి, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం సమీప పట్టణాలకు తరలించడం ఎంతో అభినందనీయమని తెలిపారు.

కేశవపట్నం 108 వాహన సిబ్బంది తమ సేవల ద్వారా మండల ప్రజల్లో విశ్వాసం కలిగించారని, తాను చేసిన తనిఖీలో వెల్లడయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై రికార్డులను పరిశీలించి, EMT గూడూరి సతీష్ రెడ్డి, పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా నుంచి సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి సేవలను ప్రశంసించి, అభినందించారు. అలాగే, మరింత మెరుగైన సేవల కోసం పలు సూచనలు చేశారు.

ఇంటి థియేటర్‌ ఫీల్!
TCL 55″ 4K QLED Google TV తీసేసా!
MRP: ₹1,09,990
➡️ డీల్‌లో కేవలం ₹40,990కి (63% తగ్గింపు!)
4K QLED | 120Hz Refresh Rate | Dolby Atmos
గేమింగ్‌ కోసం 288Hz Game Accelerator
️ 2 ఏళ్ల వారంటీ + Free Open Box Inspection

ఇంట్లోనే సినిమాల థియేటర్ ఫీల్!
ఎవరు అయినా TV తీసుకోవాలంటే… అమెజాన్లో కొనేందుకు
లింక్పైhttps://amzn.to/4fvc9Z7 క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *