Youth Congress” శంకరపట్నం, ఆగస్ట్ 28 (డిసి ప్రతినిధి):
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన దండు చిరు సాయికుమార్‌ను యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్‌గా జాతీయ నాయకత్వం నియమించింది. ఈ మేరకు ఆయన్ను నియమిస్తూ అధికారికంగా నియామక పత్రంను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరు సాయికుమార్ మాట్లాడుతూ, “మొలంగూర్ గ్రామానికి చెందిన తాను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, యువతలో పార్టీకంటే ఆశయమే పెద్దది అనే భావనను పంచడానికి నిబద్ధతతో పనిచేస్తానని” తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తన నియామకానికి తోడ్పాటినందించిన శంకరపట్నం మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆడెపు అజయ్, మానకొండూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అట్ల అనిల్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ షారుక్, మాజీ మండల యూత్ అధ్యక్షుడు మహమ్మద్ ఇస్సాముద్దీన్, మొలంగూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
