Kavvampalli” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రెండో సోదరుడు రాజేశం గారి దశదిన కర్మ కార్యక్రమం శుక్రవారం శంకరపట్నం మండలం అలుగునూరులోని శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు హాజరై నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వరరావు తదితరులు హాజరై రాజేశం గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అలాగే, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా, సిరిసిల్ల ఎస్పీ మహేష్ భగవతి గీతే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ తానాజీ, ఇతర అధికారులు, పలువురు ఏసీపీలు, చైర్మన్లు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వారి మధ్య కవ్వంపల్లి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సంఘీభావం వ్యక్తం చేశారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల వ్యక్తులు ఇలా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఘనత కలిగించారు.
మీరు మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా..? కింది లింక్ పై క్లిక్ చేయండి..
Lava Play Ultra 5G: లిమిటెడ్ టైం ఆఫర్ లో … అద్భుతమైన ఫీచర్లతో కేవలం ₹14,998కే!

మిరానా వారియర్ 360° స్టంట్ RC కార్! ⚡
హై స్పీడ్ – హై స్టైల్ – హై ఫన్!
Sky Blue Edition
360° రోటేషన్ స్టంట్స్
పక్కా కంట్రోల్‌తో ఫన్ డ్రైవింగ్
Type-C USB ఛార్జింగ్
Made in India – Safe & Stylish
Boys & Girls – అందరికీ సరదా గిఫ్ట్!
ఇప్పుడే బుక్ చేయండి – కేవలం ₹999/- మాత్రమే!
( 23% డిస్కౌంట్ – లాస్ట్ స్టాక్!)
847+ రివ్యూస్ | 200+ కొనుగోళ్లుఏ already this month!
ఫాస్ట్ డెలివరీ – డీటెయిల్స్ కోసం!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3VlRZaKలింక్ పై క్లిక్ చేయండి..
