Local news ” శంక‌ర‌ట‌పట్నం వార్త‌లు

Local news ” అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలి….
రేషన్ కార్డులలో తప్పులను సవరించేలా చర్యలు చేపట్టాలి…
ఎమ్మెల్యేకు టిడిపి నాయకుల వినతి…
హడక్ కమిటీ సభ్యులు ప్రభాకర్…

శంకరపట్నం డిసి ప్రతినిధి
అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేసి పేద కుటుంబాలకు అండగా నిలవాలని, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు వినతి పత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్ర‌వారం అందజేశారు. ఈ విష‌యాన్ని తెలుగుదేశం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, తెలుపు రేషన్ కార్డులు, తో పాటు ఇతర సంక్షేమ పథకాల ఎంపికలో పారదర్శకంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకొని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించి నిరుద్యోగులకు ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుపు రేషన్ కార్డులలో అనేక తప్పులు దొర్లి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, చేర్పులు, మార్పులు జరిగే విధంగా చర్యలు తీసుకొని ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు అందే అందుకు చెరువు తీసుకోవాలన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలని, ఎమ్మెల్యే సత్యనారాయణ కు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓ వినతిపత్రం అందజేసినట్లు ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కదిరే కొమురయ్య, బైరి తిరుపతి, గోపి వీరమల్లు, మహమ్మద్ షాబీర్, దాసారపు అనిల్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////////

రైతుల పక్షపాతి కాంగ్రెస్ సర్కార్…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి…

 


శంకరపట్నం డిసి ప్రతినిధి
రైతుల సంక్షేమానికి కట్టుబడటమే కాకుండా వారికి మరింత మేలు చేయాలన్న కృతనిశ్చయంతో రేవంర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మానకొడూర్ శాసనభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలం రేణిగుంట, కొత్తపల్లి, నుస్తులాపూర్, నల్లగొండ, మక్తపల్లి,బాలయ్యపల్లి,పర్లపల్లి, మొగిలిపాలెం, నర్సింగాపూర్, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పోరండ్ల, గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే రైతు రుణమాఫీ అమలు చేసిందన్నారు. ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా రెండు లక్షల వరకు గల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ కు దక్కిందన్నారు. ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,300 చెల్లించి కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. రైతులకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు. దొడ్డు వడ్లకు రూపాయలు 2320 ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వ్యాపారులకు కాకుండా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు,కుంట రాజేందర్ రెడ్డి,శ్రీగిరి రంగారావు,బుధారపు శ్రీనివాస్, ఎస్.కొండల్ రావు, గోగూరి నర్సింహారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, రెడ్డిగాని రాజు, నోముల అనిల్,ఎలుక రాజు, గోదారి తిరుపతి, పొన్నాల చిరంజీవి, మార్క నర్సయ్య, పెంట వినోద్ కుమార్, చిట్టి బాబు, కె.సంపత్, జొన్నవగడ్డ లింగయ్య, చిరుతల శ్రీధర్, గట్టు మల్లేశం, దుబ్బాల నర్సయ్య, తూముల శ్రీనివాస్, ఎస్,తిరుపతిరెడ్డి, రాములు యాదవ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

 

కోతలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు …
ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి…
శంకరపట్నం డిసి ప్రతినిధి


ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ పేరిట కోతలు విధించకుండా కొనుగోళ్లు చేపడతామని మానకొండూర్ శాసనభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి, మానకొండూర్, రంగపేట, పచ్చునూరు, వెల్ది, వేగురుపెల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇక నుంచి తాలు, తేమ, తరుగు పేరిట ఎలాంటి కోతలు ఉండని , ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. దళారుల బారినపడకుండా ఉండేందుకు వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. రైతాంగానికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందుకే ఆ దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతులను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల బాగు కోసం పాటుపడుతున్నదని ఆయన చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ 500 బోనస్ ఇస్తున్నదన్నారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మానకొండూర్ మండల తహశీల్దార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, పి.కనుకయ్య, శ్రీనివాస్ రావు, ఎం నాగిరెడ్డి, బి.మల్లయ్య గౌడ్, ఎన్.బాబురావు, దాసరి శంకర్, వాల అంజుత్ రావు, బోళ్ల మురళీధర్, సాయిరి దేవయ్య, మాడ తిరుపతి రెడ్డి, కనుకం అశోక్, కోండ్ర సురేష్,రొంటాల లక్ష్మారెడ్డి, శ్రీధర్,సుధగోని తిరుపతి గౌడ్, ఇర్ఫాన్, మడపు ప్రేమ్ కుమార్, కనుకం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…
రైతులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు …
శంకరపట్నం డిసి ప్రతినిధి

ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. శంకరపట్నం మండలంలోని తాడికల్,కరీంపేట్, కొత్తగట్టు, లింగాపూర్, మెట్పల్లి, ఆముదాలపల్లి, మొలంగూర్ శుక్రవారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి, అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గన్ని సంచుల కొరత సమస్య తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బస్వాగౌడ్, తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మధుకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపెల్లి తిరుపతి, పాలకవర్గ సభ్యులు, మండల రైస్ మిల్లర్స్ అధ్యక్షులు తనకు ప్రభాకర్, కొత్తగట్టు మచ్చ గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి, జనగామ అనిల్ కుమార్, ఎగ్గని రమేశ్, తిరుపతి, నారాయణ రెడ్డి, గొట్టె మధు, ఓదెలు, సంతోష్, ఇషాముద్దీన్, షారుఖ్, శ్రావణ్, జి.ప్రవీణ్, రాజ్ కుమార్, వీరయ్య, తిరుపతి, టి.సత్యనారాయణ, కె.మధుకర్ రెడ్డి, తిరుపతి,చింతకుంట తిరుపతి, రమేశ్, తిరుపతి, తాడికల్, మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *