Laksha Undrallu” బొజ్జ గణపయ్యకు లక్ష ఉండ్రాళ్ళు

Laksha Undrallu”  బొజ్జ గణపయ్యకు లక్ష ఉండ్రా
ఆలయ పూజారి శివప్రసాద్…
శంకరపట్నం డిసి ప్రతినిధి
గణపతి నవరాత్రి ఉతవాల్లో భాగంగా బొజ్జ గణపయ్యకు శనివారం లక్ష ఉండ్రాళ్లు లక్ష గరకపూసలతో అత్యంత భక్తి శ్ర‌ద్ద‌ల‌తో ఘనంగా పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు బంగి మఠం శివప్రసాద్ తెలిపారు. కరీంనగర్ జిల్లా శంక‌ర‌ట‌ప‌ట్నం మండ‌లం మొలంగూర్ గ్రామంలో పురాతనమైన శివాలయంలోగణపతి నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని, అభిషేకం, బొజ్జ గణపయ్యకు అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష ఉండ్రాళ్లతో , లక్ష ఘరకపూసలతో ఘనంగా పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ సంవత్సరం,గ్రామానికి చెందిన దండు స్వరూప సమ్మయ్య కుమార్తె, కుటుంబ సభ్యులు, కాగజ్ నగర్ వాస్తవ్యులు వెజ్జ కొమురయ్య కమల, గౌతమి శివ కుమార్, కీర్తి కిరణ్ కుమార్, అందజేశారని, విగ్రహం గణపయ్య విగ్రహాన్ని అందజేశారని, విగ్రహ దాతలకు, భక్తులకు అభిషేకంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి కృప కటాక్షం ఎల్లకాలం ఉండాలన్నారు. పూజా కార్యక్రమంలో స్వామి వారిని వేడుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బంగి మఠం శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *