Karimnagar” పేద ప్రజల మనసు ఎరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
శంకరపట్నం:
డిసి ప్రతినిధి:
పేద విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పనిచేస్తున్నారని, బిజెపి పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి చెప్పారు. శనివారం, కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం తాడికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జన్మదిన పురస్కరించుకొని, మోడీ కానుకగా సైకిళ్లు విద్యార్థులకు అందజేయడమే కాకుండా, పేద విద్యార్థులకు మరిన్ని ఆచారాలు, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని సంచారించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందించడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో, ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యా పరమైన కిట్ లను కూడా పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయడమయింది. సైకిళ్లు అందుకున్న విద్యార్థులు బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల అధ్యక్షుడు అనిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, రాసమల్ల శ్రీనివాస్, వడ్లకొండ రాజేందర్, వెంగల ప్రవీణ్, మొలుగూరి ప్రశాంత్, కొమ్ము సాగర్, ఉషాకోయిల మహేష్, వెంగల మహెందర్, మొల్గూరి రాములు, వెంగల ప్రవీణ్, మెడిశెట్టి రాజేష్, చెరుకు శివ, సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
