Polling Booth” ఎంపీటీసీ ఓటరు జాబితా..

Polling Booth”  పోలింగ్ బూతుల ప్రకటన…
శంకరపట్నం: డిసీ ప్రతినిధి
ఎంపీటీసీ ఓటరు జాబితా పోలింగ్ బూతులను నోటీసు బోర్డులపై ప్రకటించినట్లు మండల ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని 13 మండల ప్రాదేశిక నియోజకవర్గం ఓటరు జాబితా పోలింగ్ బూతులను ఎంపిక చేసి, నోటీస్ బోర్డుపై అంటించినట్లు పేర్కొన్నారు. ఇట్టి జాబితాల పై అభ్యంతరాలు ఉన్నచో ఈ నెల 8 లోపు అభ్యంతరాలు తెలియజేయాలి, 9వ తేదీన పరిశీలన చేసి, 10 వ తేదీన పూర్తి జాబితాను ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తయారుచేసి నివేదికలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూపర్ ఇండెంట్ రాఘవేందర్ రెడ్డి, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది , తదితరులు ఉన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *