District Mahasabhalu” కార్మికులకు అండ సంఘం..

District Mahasabhalu”  భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభలు విజయవంతం…
నూతన జిల్లా కమిటీ ఎన్నిక…
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
కార్మికులకు అండగా సంఘం ఉండి అనేక పోరాటాలను చేస్తున్న‌ట్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కోటంరాజు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో గల శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో శనివారం సంఘం 6వ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కోటంరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు గీత ముకుంద రెడ్డి ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు .భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం,భవన నిర్మాణ కార్మికుల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ చట్టం, సెస్ యాక్ట్, అంతర్రాష్ట్ర వలస కార్మికుల కార్మికుల చట్టం రక్షణ కోసం ఈ మహాసభలో తీర్మానాలు చేయటం. చాలా అభినందనీయ‌మ‌న్నారు. సెప్టెంబర్ 23,24 తేదీల్లో భద్రాచలంలో జరిగే సమావేశాలను జయప్రదం చేసేందుకునూతన జిల్లా కమిటీ కృషి చేయాలన్నారు.నూతన కమిటీ 23మందితో ఏకగ్రీవంగా నియామకమయ్యారని, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కదిరే రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్,జిల్లా కోశాధికారి గా వట్టి జగదీష్,జిల్లా ఉపాధ్యక్షులుగా జి.రాజేశం,జంబుకం వెంకన్న,రాజకుమారి,పళ్ళ తిరుపతి,సహాయ కార్యదర్శిగా బత్తుల ప్రసాద్,రావుల ఎల్లయ్య,చక్రపాణి,కన్నం నర్సయ్య ఆఫీస్ బేరర్స్ గా ఎన్నికయ్యారు.
ఈ సంద‌ర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ.. మీ యూనియన్ 12 మండలాల నుండి 16 మండలాల విస్తరించాలి… 53 రకాల భవన నిర్మాణ కార్మికులు మన యూనియన్లో సభ్యత్వం చేయాలని కోరుతున్నామ‌న్నారు. భవన నిర్మాణ కార్మికుల 3 చట్టాలు రద్దు చేసిన బీజేపీ నేతలను తీవ్రంగా వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాల‌ని చెప్పారు. ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి సుమారుగా 400 మంది కార్మికులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు జంబుకం వెంకన్న,పళ్ళ తిరుపతి,రాజకుమారి,జిల్లా సహాయ కార్యదర్శి ఇమ్మడి చక్రపాణి,రేణుకుంట సారయ్య,శ్యాం సుందర్, మోతె మహేంద్ర్మర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *