Matsya Girindra Swamy” మత్స్య గిరింద స్వామి సన్నిధిలో జిల్లా సివిల్ జడ్జ్

Matsya Girindra Swamy”  షరీర ప్రశాంత్ దంపతుల ప్రత్యేక పూజలు..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
దశ అవతారా లోని ఒక అవతారమైన శ్రీ మత్స్య గిరింద్ర స్వామి సన్నిధిలో కరీంనగర్ జిల్లా సివిల్ జడ్జ్ శ్రీమతి షరీర ప్రశాంత్ ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండలం, కొత్తగట్టుగుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి సన్నిధిలో జిల్లా సివిల్జర్స్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆచారం ప్రకారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోరెం రాజిరెడ్డి, వేద పండితులు సివిల్ జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సత్కారాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసినట్లు ఆలయ చైర్మన్ కోరెం రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మురళీధర్ ఆచార్యులు, ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *