Dasara Holidays” తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ఈ సంవత్సరం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా 13 రోజుల సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు సెప్టెంబర్ 21 (ఆదివారం) నుంచి అక్టోబర్ 3 (శుక్రవారం) వరకు కొనసాగనున్నాయి. పాఠశాలలు మళ్లీ అక్టోబర్ 4 (శనివారం) నుంచి పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చినట్టు తెలుస్తున్నది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి.. కాగా 4 తేది శనివారం 5 తేదీ ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా స్కూల్స్ రీపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..
View this post on Instagram
