BikeAccident” ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒక్కరికి గాయాలు…

BikeAccident”  శంకరపట్నం: డిసి ప్రతినిధి:
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ పట్టణానికి చెందిన గొల్లపల్లి తరుణ్ అతని స్నేహితుడు అరవిందుతో కరీంనగర్ నుండి వరంగల్ వైపుకు వెళుతుండగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో తరుణ్ కు బలమైన గాయాలు కావడంతో వెంట ఉన్న స్నేహితుడు 108 వాహనానికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహన పైలెట్ ఎం గోపికృష్ణ, ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటి సతీష్ రెడ్డి తెలిపారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Dasara Holidays” ద‌స‌రా సెల‌వుల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌

BoatAccident” నైజీరియాలో పడవ ప్రమాదం – 60 మంది మృతి.. మిగతావారికోసం గాలింపు కొనసాగుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *