Lakshmi Narasimha Swamy Bejjanki” శ్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తుల విరాళంగా వెండి పాదుకలు .. స్వామివారి అనుగ్రహంతో కోరికల నెరవేరుడే

 Lakshmi Narasimha Swamy Bejjanki” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:

భక్తులు తమ కోరికలు నెరవేరిన అనంతరం కృతజ్ఞతా కానుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి వెండి పాదుకలను బహుకరించారు. ఈ వివరాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జిల్లా ప్రభాకర్ మంగళవారం వెల్లడించారు.

భక్తుల సేవాభావానికి ప్రశంసలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి, చీలాపూర్‌కు చెందిన కౌటో జ్వాల సరిత, విద్యాసాగర్, విద్యా వినోద్ అనే భక్తులు సుమారు 400 గ్రాముల వెండి పాదుకలను బహుకరించారు.

స్వామి అనుగ్రహంతో కోరికల నెరవేరు

చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ, “స్వామివారి అనుగ్రహంతో భక్తుల కోరికలు తీరి, వారు తమ ఇంట్లో కొంగు బంగారంగా జీవించాలనే ఆశయంతో ఈ విరాళం ఇచ్చారు,” అని పేర్కొన్నారు.

సేవాభావం అందరికీ ఆదర్శం

భక్తులైన సరిత, విద్యాసాగర్, విద్యా వినోద్ ల సేవా భావం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుందంటూ, ఆలయ కమిటీ వారి సేవలను కొనియాడింది.

అర్చకులు, భక్తుల సమక్షంలో కార్యక్రమం

ఈ కార్యక్రమంలో:

  • ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు

  • ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు

  • స్థానిక భక్తులు
    తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *