ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మందముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
సోమవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులు పరమేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
అభినందనలు అందుకున్నవారు:
-
అధ్యక్షుడు: వేముల తిరుపతిరెడ్డి
-
ప్రధాన కార్యదర్శి: గ్యారంపల్లి శివాజీ
-
వర్కింగ్ ప్రెసిడెంట్: పారెళ్లి సాగర్
-
ఉపాధ్యక్షులు: ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి
-
కోశాధికారి: గుత్తి శేఖర్
-
జాయింట్ సెక్రటరీ: దాస రాజు
అలాగే సీనియర్ జర్నలిస్టులు దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, కోడికంటి శ్రీనివాస్, ఎస్. ముత్యం రెడ్డి, ఓ. రమేష్, రాజులు తదితరులను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. పాత్రికేయులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, చేదోడువాదోడుగా నిలుస్తానని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీకి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
