Peddaplli” ఫిబ్రవరి 20లోపు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి :
సినిమా మరియు నిర్మాణ రంగాల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులు పూర్తిగా ఉచితంగా మూడు నెలల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ శిక్షణలో భాగంగా సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్స్, డిజిటల్ డిజైన్ & సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి సినిమా రంగానికి సంబంధించిన కోర్సులతో పాటు కన్స్ట్రక్షన్ సేఫ్టీ, మెకానికల్, కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిషియన్, ఎన్విరాన్మెంటల్, సర్వేయర్, సూపర్వైజర్, మెకానికల్–ఎలక్ట్రికల్–ప్లంబింగ్ (MEP), ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం వంటి నిర్మాణ రంగ నైపుణ్య కోర్సులు అందించనున్నట్లు తెలిపారు.
సినిమా రంగానికి సంబంధించిన కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత, నిర్మాణ రంగ కోర్సులకు డిప్లొమా / ఐటీఐ / బీటెక్ అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ కొండాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కేంద్రంలో నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సంబంధిత ధృవపత్రాలతో ఫిబ్రవరి 20లోపు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తు, రూమ్ నంబర్ 225లోని జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇతర వివరాలకు 9963313318, 9000294176 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
