జగిత్యాల: జిల్లాలోని మెట్పల్లి మండలంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దాపూర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ (SRSP) కాలువలోకి ఓ బైక్ దూసుకెళ్లడంతో, దానిపై ప్రయాణిస్తున్న యువతీ యువకుడు ఇద్దరూ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.
అసలేం జరిగింది?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన అంకుష్ (20) కూలీ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే పని చేస్తున్న వెల్లుల్ల గ్రామానికి చెందిన లావణ్య (19) తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి బైక్‌పై వెళ్తున్గ్నారు. బైక్‌ను లావణ్య నడుపుతున్నది. పెద్దాపూర్ కాలువ సమీపంలోని మూల మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బైక్ నేరుగా కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కాలువలో పడ్డ బైక్‌ను తాళ్ల సహాయంతో బయటకు తీశారు. అయితే, అప్పటికే యువతీ యువకుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.
పోలీసుల గాలింపు చర్యలు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో కాలువలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి వారి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైక్ నడుపుతూ కాలువలోకి దూసుకెళ్లిన యువతి
యువతితో పాటు బైక్‌పై కూర్చున్న యువకుడు కూడా కాలువలో గల్లంతు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘటన
మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్‌తో సహా కెనాల్లో పడి గల్లంతు
గమనించి బైక్‌ను బయటకు తీసిన స్థానికులు
దొరకని యువతి,… pic.twitter.com/GWxPQvl1TY
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
55 పతకాలతో రికార్డు.. కరీంనగర్ క్రీడాకారుల హవా: రాష్ట్రస్థాయిలో మూడో స్థానం..
