వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల పరిధిలో అక్రమ గంజాయి సాగు ఉదంతం వెలుగులోకి వచ్చింది. అగ్రహారం గ్రామ శివారులో రహస్యంగా గంజాయి మొక్కలను పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఘటన వివరాలు:
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అచ్చే లాల్ అనే వ్యక్తి అగ్రహారం శివారు ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన వేములవాడ ఎస్సై శ్రీనివాస్, తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గ్రామస్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి, అక్కడ సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రిమాండ్‌కు నిందితుడు:
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంచార్జ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీనివాస్, పిసిలు మహిపాల్, సంతోష్, హోంగార్డ్ ఆనంద్‌లను వేములవాడ డీఎస్పీ ఏ. శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.
డీఎస్పీ హెచ్చరిక:
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
“గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలిఅని చెప్పారు.
- “ఎక్కడైనా అక్రమ సాగు లేదా విక్రయాల సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
-
“సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు శుభవార్త: ఉచితంగా కోడెల పంపిణీ.. దరఖాస్తు చేసుకోండిలా!
పల్సర్ బైక్ నడిపిన యువతి.. జగిత్యాలలో ఘోర ప్రమాదం
55 పతకాలతో రికార్డు.. కరీంనగర్ క్రీడాకారుల హవా: రాష్ట్రస్థాయిలో మూడో స్థానం..
