మరో వీడియోను షేర్ చేసిన ఇస్రో
చంద్రుడి దక్షిణ ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినా నాటి నుంచి అక్కడ రికార్డవుతున్న దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) పంచుకుంటోంది. ప్రస్తుతం మరో వీడియోని విడుదల చేసింది. దీంట్లో ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ ముందుకెళ్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. కొంచెం ముందుకు వెళ్లి ఆగి.. ఎడవైపుకి తిరుగుతుంది. ఈ వీడియోను ఇస్రో షేర్ చేస్తూ.. శివశక్తి పాయింట్ వద్ద ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు కొడుతోందని చంద్రుని రహస్యాలను కనుగొంటుందని అని రాసుకొచ్చింది.
ఇస్రోగురించి తెలుసు… మరి సుపార్కో గురించి తెలుసా..?
రోవర్ ఇలా దిగింది.. వడివడిగా ప్రజ్ఞాన్ అడుగులు
శుక్రవారం విడుదల చేసిన వీడియోలో చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అవ్వడం, దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ జారుకుంటూ బయటకు రావడం వంటి వి చూశాం. చంద్రుడిపై ల్యాండ్ అయిన ప్రాంతానికి ‘శివశక్తి’ పాయింట్ పేరుని ప్రధాని నరేంద్రమోదీ పెట్టారన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పిలుస్తామని మోదీ తెలిపారు.
https://twitter.com/isro/status/1695378531243454712?s=20