Saturday , 27 July 2024
Breaking News

ఇక సూర్యుడి సంగ‌తి తేలుస్తాం..

ఇస్రో సైంటిస్టుల మరో ప్రాజెక్ట్‌

చంద్ర‌యాన్ 3 విజ‌యవంతం కావ‌డంతో ప్ర‌పంచం మొత్తం ఇస్రో వైపు చూస్తోంది. ఏ దేశానికి సాధ్యంకాని ద‌క్షిణ దృవం చేరుకున్న ఇస్రో ఇక సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదిత్య ఎల్‌-1′ సోలార్‌ మిషన్‌ను ప్రారంభించేందుకు సెప్టెంబర్‌ 2వ తేదీన ‘ సమాయత్తమవుతోంది.

ఇస్రోగురించి తెలుసు… మ‌రి సుపార్కో గురించి తెలుసా..?

భానుడి పుట్టుక, అక్కడి వాతావ‌ర‌ణ పరిస్థితులను తెలుసుకునేందుకే ఈ ప్ర‌యోగం ఇస్రో చేపడుతోంది. మొదట ‘ఆదిత్య ఎల్‌-1స‌ను భూమి నుంచి 15 లక్షల కిలోవిూటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌-1 (ఒ-1) ద‌గ్గ‌ర ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. ఆ త‌రువాత మొత్తంగా 177 రోజుల పాటు ఇది ప్రయాణం చేసి, ఆ కక్ష్యలోకి చేరుకుంటుంది. దీని ద్వారా.. సూర్యుడి రహస్యాలను కనుగొనవచ్చు. సూర్యుడు ఎలా పుట్టాడు..? అక్కడి వాతావరణం ఏ విధంగా ఉంటుంది వివరాలతో తెలుసుకోనున్నారు. దీంతో ఫొటోస్పియర్ ( కాంతిమండలం ), క్రోమోస్పియర్ (వర్ణ మండలం ), సూర్యుని బయటి పొరలపై అధ్యయనం చేయ‌నున్నారు. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్‌ ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌ క్రాప్ట్‌ ఇదే. ఇంత‌కు ముందు అమెరికా, జర్మనీ, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపాయి.

రోవ‌ర్ ఇలా దిగింది.. వడివడిగా ప్రజ్ఞాన్ అడుగులు

ఒకవేళ ఆదిత్య ఎల్‌-1 సోలార్‌ మిషన్‌ విజయవంతం అయితే.. సూర్యుడిపైకి ఉపగ్రహం పంపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ‌హ‌రి కోట నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌ని ఉపయోగించి ఈ ‘ఆదిత్య ఎల్‌-1’ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. పీఎల్‌ఎల్‌వీ-సీ57 అనే వాహననౌక ఈ ఆదిత్య-ఎల్‌ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా శోధించడమే ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశమని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్టేల్రియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారంతో ఇస్రో ఈ సౌర అధ్యయన పక్రియను చేపట్టనుందని ఆయన వివ‌రించారు. ఇది పూర్తి స్వదేశీ స్వదేశీ ప్రయత్నమన్నారు.

చంద్రుడిపై ప్రజ్ఞాన్‌ చక్కర్లు

ఈ ‘ఆదిత్య ఎల్‌-1’లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. అవి.. 1. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ), 2. సోలార్‌ అల్టావైల్రెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, 3. ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, 4. ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, 5. ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్టోవ్రిూటర్‌, 6. హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్టోవ్రిూటర్‌, 7. మ్యాగెటోవిూటర్‌. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. నాలుగు పేలోడ్స్‌ నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్‌ సవిూపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

 

 

About Dc Telugu

Check Also

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Thirupathi Crime news

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Thirupathi Crime news”  త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేశార‌ని అన్న కుటుంబాన్ని హ‌త్య చేసి త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com