– కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఫెడరేషన్ నాయకులు బాపురావు
కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బి గోపి ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఫెడరేషన్ డైరీనీ కలెక్టర్ కు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కలెక్టర్ కు వివరించారు. అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు తదితరులు ఉన్నారు.