మోటారు రిపేర్ చేస్తుండగా కరెంటు షాక్ కు గురయ్యి ముగ్గురు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో ని తుల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జగ్గంపేట మండలం రాజపూడి శివారున సీతారాంపురం గ్రామంలో గళ్ల అప్పారావు అనే వ్యక్తి ఫామాయిల్ తోట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో తోటలోని విద్యుత్ మోటార్ రిపేర్‌కు గురైంది. దీనిని రిపేర్ చేసేందుకు అప్పారావు కుమారుడు గళ్ల నాగరాజు, జగ్గంపేటకు చెందిన కిల్లి నాగు, కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన భోదిరెడ్డి సూరిబాబు వెళ్లారు. మోటారును బయటకు తీస్తుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలకు మోటారు తగిలింది. ఒక్కసారిగా ముగ్గురు విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …