మంగళవారం నాడు బెంగూళురు కు పలు సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల గురించి వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీళ్లను తమిళనాడుకు విడుదల చేశారు. నీటిని విడుల చేయడాన్ని కర్ణాటక ప్రజలు తప్పు పడుతున్నారు. 300 సంస్థలు బెంగూళురు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వీరితో పాటు మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత చంద్రూ మాట్లాడారు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని టౌన్ హాల్ నుంచి మైసూర్ వరకు వెళ్తామన్నారు. ఆ తరువాత కర్ణాటక ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వవనున్నట్టు తెలిపారు. ఈ పరిణామాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి , నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ఈ ఆందోళనల్లో రాజకీయ కోణం ఉందన్నారు. తాము కర్ణాటక రైతుల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పారు. ఆందోళనకు కారులు బంద్ కు పిలుపునివ్వవద్దని సూచించారు.