టీవీడిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

సీరియ‌స్‌గా టీవీ డిబెట్ న‌డుస్తోంది. రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రిపై దూషించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి త‌ల‌మీద నుంచి ఒక్కటేశాడు. దీంతో అత‌నూ లేచి తిర‌గ‌బ‌డ్డాడు. ఆందోళ‌న‌కు గురైన టీవీ చానెల్‌ ఉద్యోగులు వారిద్ద‌రి వారించి ఇంటికి పంపించేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్ టీవీ చాన‌ల్ అయిన‌టుంటి ఎక్స్‌ప్రెస్ న్యూస్ ప్రైమ్ టాక్ షోలో చోటు చేసుకుంది. ఈ త‌తంగానికి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకాయ‌న పీఎంఎల్ ఎన్ సెనేట‌ర్ డాక్ట‌ర్ ఆఫ‌నానుల్లా ఖాన్ మ‌రొక వ్య‌క్తి పీటీఐ కోర్ క‌మిటీ స‌భ్యుడు, లాయ‌ర్ షేర్ ఖాన్ మార‌వాత్ వీరి మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. ఈ చ‌ర్చ‌కు యాంక‌ర్ గా జావెద్ చౌద‌రి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇది లైవ్ కాదు కాబ‌ట్టి టీవీలో ప్ర‌సారం చేయ‌లేదు. కానీ వీడియోను ఆన్‌లైన్‌లో వైర‌ల్ చేశారు. దీనిపై పలువురు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. యాంక‌ర్ ను త‌ప్పు ప‌డుతున్నారు. ఇటువంటి వాటిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోరు అని ప్ర‌శ్నిస్తున్నారు

 

https://www.facebook.com/reel/707302494061543?sfnsn=wiwspwa&mibextid=NbTXJF

https://www.facebook.com/reel/707302494061543?mibextid=NbTXJF

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *