మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలు విలయ తాండవం చేస్తోంది. కారణాలు ఏవైనా వరసుగా రోగులు మృతి చెందుతున్నారు. నాందేడ్ ప్రభుత్వ దవాఖానాలో 48 గంటల్లో 31 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ 24 గంటల వ్యవధిలో ఓ పసిగుడ్డు సహా 11 మంది రోగులు మరణించారు. ఈ మరణాలతో గడిచిన 8 రోజుల్లో వివిధ కారణాల 108 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,100 మంది వివిధ సమస్యలతో చికిత్స కోసం హాస్పటల్‌కి వచ్చరని అధికారులు చెప్పారు. ఇందులో 191 రోగులు దవాఖానాలో ఆడ్మిట్ అయ్యారన్నారు. గతంతో పోల్చినప్పుడు మరణాల రేటు కొంచెం తగ్గినట్టు వైద్యులు తెలిపారు. మరణాల రేట్ ఆవరేజ్‌గా ఇంతకు ముందు 24 గంటల్లో 13గా ఉండేది. ఇప్పుడు 11కి పడిపోయిందన్నారు. ముంబాయి మహానగరంలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని జీఎంసీహెచ్‌లో 24 గంటల్లో 18 మంది మృతి చెందారు. నాగ్‌పూర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, హాస్పిటల్‌లో 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇందిరా గాంధీ గవర్నమెంట్ కాలేజీ, హాస్పిటల్‌లో 24 గంటల్లో 9 మంది రోగులు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
బైక్‌పై చేజ్.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి