ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన వ్య‌క్తి త‌న పిల్ల‌ల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు విష‌మిచ్చి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌టన గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కానుబారు సోలంకి, అత‌ని వైఫ్ శోభాబెన్‌, కుమారుడు కోడ‌లు మ‌నీష్‌, రీటా వీరిపిల్ల‌లు ముగ్గురు కుమారుడు (ఆరేళ్లు) 10,13 ఏండ్ల ఇద్ద‌రు కుమార్తెలు నివాస‌ముంటున్నారు. మ‌నీష్ కాంట్రాక్ట‌ర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్ర‌మంలో అతని వ‌ద్ద అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌వ‌డంతో మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. త‌ల్లిదండ్రులు, భార్యాపిల్ల‌ల‌కు విష‌మిచ్చి మ‌నీష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట‌న స్థ‌లంలో ఆత్మ‌హ‌త్య లేఖ ల‌భించింది. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి

కేర‌ళ‌లో బాంబు పేలుళ్లు.. ఒక‌రి మృతి

భార్య‌ను చంపి.. రోడ్డు ప్ర‌మాదంగా న‌మ్మించి.. ప్రియురాలి భ‌ర్త‌ను చంపి.. సినిమాను త‌ల‌పించే స్టోరీ

పులి మెడ‌కు తాడు క‌ట్టి.. సాధు జంతువు వ‌లె రోడ్డు మీద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *