ట్రాక్ట‌ర్తో స్టంట్స్ చేయ‌బోతే… ప్రాణాలే పోయాయి..

పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఓ యువ‌రైతు ట్రాక్ట‌ర్‌తో విన్యాసం చేయ‌బోయాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు మృతి చెందాడు. జిల్లాలోని ప‌తేఘ‌ర్ చురియ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్చూర్ గ్రామానికి చెందిన 29 సంవ‌త్స‌రాల సుఖ్ మ‌న్ దీప్ సింగ్ క్రీడా ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నాడు. అక్క‌డ ట్రాక్ట‌ర్‌తో విన్యాసం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. డ్రైవ‌ర్ లేకుండా న‌డుస్తున్నట్రాక్టర్ టైర్ కాళ్లు పెట్టి దానిపైకి ఎక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. కానీ కాళ్లు బుర‌ద‌లో ఇరుక్కోవ‌డం వ‌ల్ల ట్రాక్ట‌ర్ టైర్ల కింద ప‌డ్డాడు. దాని కింద నుజ్జు నుజ్జ‌య్యాడు. అక్క‌డున్న వారు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న అక్టోబ‌ర్ 28న జ‌ర‌గ‌గా ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయ్యింది.

 

 

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. 14 మంది మృతి.. కార‌ణం ఇదే

ఉల్లి లొల్లి.. కిలో ధర @ రూ. 80

ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *