ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంటకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం – రాయగడ వెళ్తున్న
రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బిశ్వజిత్ సాహు మాట్లాడారు. మానవ తప్పిదంతోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టు తెలిపారు. లోకో పైలట్ రెడ్ సిగ్నల్ వద్ద రైలును ఆపకుండా ముందుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు విచారణ తరువాత వాస్తవమైన వివరాల తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనలో రైలు లోకో పైలట్ కూడా మృతి చెందారన్నారు. ఈ ఘటనతో ఇప్పటి వరకు 18 రైళ్లను రద్దు చేశారు. ఇంకో 22 రైళ్లను దారి మళ్లించారు.