ఓటు అనేది ఓ బ్రహ్మాస్త్రమని, దానిని సరిగ్గా వాడుకుంటే తలరాతలు మారుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఎన్నికలు వచ్చినప్పడు చాలా పార్టీలు వస్తాయన్నారు. అందులోని నాయకులు అనేక రకాల మాటలు చెబుతారన్నారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని సూచించారు. మీకు మీరు స్వంత ఆలోచనతో ఓటు వేయాలని, ఎవరో చెప్పింది నమ్మి ఓటు వేస్తే బతుకులు ఉల్టాపల్టా అవుతాయన్నారు. ఎన్నికలప్పుడు ఆగమాగం కావొద్దని చెప్పారు. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎట్లా ఉండేదో.. ఇప్పుడు ఎట్లా ఉందో చూసి ఓటు వేయాలని కోరారు. జుక్కల్‌లో తాగు, సాగు నీళ్లు లేవు, వలసపోయే పరిస్థితి, 27 బోర్లు వేసినా నీళ్లు రాలేదని అటువంటి బాధలు అనుభవించామని ఆయన గుర్తు చేశారు. సమైక్య పాలనలో నిజాం సాగర్ ఎండిపోయిదని చెప్పారు. ఆ దుస్థితిని, మన బాధలను ప్రపంచానికి చెప్పేందుకే ఉద్యమ సమయంలో నిజాం సాగర్ లో మీటింగ్ పెట్టుకున్నామని తెలిపారు. ఈ రోజు తెలంగాణాలో మిషన్ కాకతీయలో భాగంగా ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, వాగుల చెక్ డ్యాంలు కట్టి నీళ్లు తెచ్చుకున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి
ట్రాక్టర్తో స్టంట్స్ చేయబోతే… ప్రాణాలే పోయాయి..
రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్ష ఎక్స్ గ్రేషియా