మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి.. భూమి, ఆస్తుల విషయంలో హత్యల వరకు వెళ్తున్నారు. ఇటువంటి ఘటనే ఖమ్మం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి నరేశ్, వెంకటేశ్ కొడుకులు, కూతరు ఉష ఉంది. కూతురు ఉష(35)కు కొణిజర్ల మండలం గోపవరం గ్రామానికి చెందిన రామకృష్ణతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెండ్లయినప్పటి నుంచే రామకృష్ణ ఇల్లరికం ఉంటున్నాడు. ఉష తాత ( అమ్మవాళ్ల తండ్రి) మన్యం వెంకయ్య ఇంట్లో ఉంటున్నారు. వెంకయ్య చెందిన మూడు ఎకరాల భూమిని మనువరాలు ఉష పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఉషతల్లిదండ్రులు, సోదరులు జీర్ణించుకోలేదు. ఈ విషయంపై పలుమార్లు ఉషకు, తల్లిదండ్రుల మధ్య పలుమార్లు గొడవజరిగింది. తన తండ్రి వెంకయ్య ఆస్తి తనకే చెందుతుందని మంగమ్మ కోర్టుకు పోయింది. కేసు కోర్టులో విచారణ సాగుతోంది. శుక్రవారం గడ్డపారలు, వేటకొడవళ్లు, ఉష ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా నలుగురు కలిసి ఉష, ఉషభర్త రామకృష్ణలపై కత్తులు, గడ్డపారలతో దాడికి దిగారు. భయంతో వారు రోడ్డుపైకి వెళ్లిన వదల్లేదు. ఉష పక్కింట్లో వెళ్లి దాక్కున్నా వదల్లేదు. కత్తితో దాడి చేసి మరీ చంపేశారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కింది లింక్‌లను క్లిక్ చేసి పూర్తి వార్తను చదవండి
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి