అమెరికాలో క‌త్తిపోట్లు.. ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

చ‌దువు కోసం అమెరికా వెళ్లిన ఖ‌మ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అక్కడ క‌త్తిపోట్ల‌కు గురై వారం రోజులుగా చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖ‌మ్మం జిల్లా మామిళ్ల‌గూడెం గ్రామానికి చెందిన వ‌రుణ్‌రాజ్ (29) అమెరికాలోని ఇండియాన రాష్ట్రంలో ఎంఎస్ చ‌దివేందుకు వెళ్లాడు. జిమ్ కు వెళ్లి వ‌స్తున్న క్ర‌మంలో ఓ దుండ‌గుడు క‌త్తితో పొడిచాడు. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న అత‌డిని చూసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారమిచ్చారు. చికిత్స నిమిత్తం స‌మీపంలోని లూథ‌ర‌న్‌ ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్ర‌మంలో చికిత్స పొందుతూ పరిస్థితి విష‌మించి మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది.

బ‌రాబ‌ర్ బంగాళాఖాతంలో క‌లుపుతాం… ధ‌ర‌ణి ముసుగులో భూములు క‌బ్జా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన న‌వ్విన వైనం వీడియో వైర‌ల్

బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల నాలుగో విడ‌త జాబితా పెండింగ్‌లో 19 స్థానాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *