రాజస్థాన్‌లో బిజెపికి పెరిగిన అవకాశాలు
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తెలంగాణతో పాటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ మిజోరం, ఛత్తీస్‌ఘడ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు వెలువరించిన భవితవ్యం మూడో తారీఖున వెలువడనుంది. ఓటర్లు ఇచ్చే ప్రజా తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగిసిన తరువాత కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఈ సర్వేల్లో మెజారిటీ గా కాంగ్రెస్ దే అధికారం అని వెల్లడించాయి. మూడు రాష్టాల్ల్రో కాంగ్రెస్ అధికారం అందుకోనున్నదని దాదాపు అన్ని సర్వే సంస్థల్లో ఇంచుమించుగా ఇదే విషయం వెల్లడయ్యింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రాజస్తాన్‌లో మాత్రం అధికారాన్ని బిజెపికి కట్టబెట్టబోతోంది. వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొంది. భూపేశ్ భాఘేల్ సారథ్యంలో తమకు గెలుపు తథ్యమని హస్తం పార్టీ భావిస్తుండగా మోదీ మ్యాజిక్‌తో విజయం తమదే నంటూ బీజేపీ ధీమాతో ఉంది. అవనీతి రహిత పాలన అందిస్తామంటూ ఆప్ కూడా తమ వంతు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల విషయంలో స్వల్ప తేడానే ఉండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. డిసెంబర్ 3న అంచనాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకులు అంచనా వస్తున్నారు. రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. కాగా.. డిసెంబర్-03న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ నెలకొంది. వాస్తవానికి రాజస్థాన్‌లో ఇటు బీజేపీగానీ, అటు కాంగ్రెస్ గానీ వరుసగా అధికారాన్ని దక్కించుకున్న దాఖలాల్లేవ్. ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్ నేటివ్‌గా మాత్రమే పార్టీలు గద్దెనెక్కుతున్న పరిస్థితి. ప్రతీ ఐదేళ్లకోసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతోంది. ఇదివరకు కాంగ్రెస్ గెలవగా.. ఇప్పుడు కమలం పార్టీకే ప్రజలు పట్టం కడతారని కమలనాథులు ధీమా వ్యక్తం చేయగా.. సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఎన్నికలు ముగిశాయి. గతంలో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63శాతం పోలింగ్ నమోదవ్వగా.. 2023లో 77.15శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 2003 నుంచి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కేవలం 2018 ఎన్నికల్లో మాత్రమే గెలుపొందింది. అప్పటివరకూ బీజేపీనే అక్కడ అధికారంలో ఉంది. అయితే.. మార్చి 2020లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బిజెపిలో చేరి.. రాష్ట్రంలోని కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లోనూ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది. తామే అధికారంలోకి తిరిగి వస్తామని బీజేపీ చెప్తుండగా.. మధ్యప్రదేశ్‌లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది తామేనని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత విదేశీ పర్యటకు వెళ్లిన తొలి టీం ఇదే..
అమ్మడానికి, వదిలేయలేని ఏనుగును ఏం చేస్తావ్.. ఇంటర్య్వూలో వింత ప్రశ్న
ఉస్తాద్ ఇస్మార్ట్ డబుల్ లుక్స్ అదుర్స్